బడి బయట పిల్లలను తక్షణం గుర్తించాలి

UPDATED 7th FEBRUARY 2020 FRIDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్) : ప్రభుత్వ పాఠశాలలో చదవకుండా బడి బయట ఉన్న పిల్లలను గుర్తించేందుకు ప్రభుత్వ సర్వే చేపట్టిందని మండల విద్యా శాఖాధికారిణి ఎస్. విజయలక్ష్మీదేవి పేర్కొన్నారు. స్థానిక మండల వనరుల కేంద్రంలో మండలంలో పని చేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, పార్ట్ టైం ఇనస్ట్రక్టర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు, బడిలో చదవకుండా ఉండేవారు, మానేసిన పిల్లలు, బాల కార్మికులను మన బడి యాప్ ద్వారా గుర్తించి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ నెల 13వ తేదీలోపు ప్రతీ గ్రామంలో ప్రతీ వార్డులో పర్యటించి బడి బయట పిల్లల వివరాలు సేకరించి ఆన్ లైన్ లో నమోదు చేయాలని తెలిపారు. ఎటువంటి సందేహాలు ఉన్నా ఎంఈవో కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. ఈ సమావేశంలో సీఆర్పీలు వీర్రాజు, శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు, కంప్యూటర్ ఆపరేటర్ సుబ్రమణ్యం, ఎంఐఎస్ ప్రశాంతి, తదితరులు పాల్గొన్నారు.

ads