గొర్రెల మంద పైకి దూసుకెళ్లిన కారు:20 గొర్రెలు మృతి

పెద్దాపురం,11 అక్టోబరు 2020(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం పట్టణ శివారు గాలిబంగ్లా ప్రాంతంలో ఆదివారం సాయంత్రం గొర్రెల మందపైకి ఇండికా కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 20 గొర్రెలు వరకూ అక్కడిక్కడే మృతి చెందాయి. పట్టణానికి చెందిన గొర్రెల పెంపకందారుడు ఆల్సి లక్ష్మణ్ (లచ్చి) తన గొర్రెలను మేతకు తీసుకువెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి తోలుకు వస్తుండగా అటువైపు వస్తున్న టాటా ఇండికా కారు అదుపుతప్పి గొర్రెల మందమీదకు వేగంగా దూసుకుపోయింది. దీంతో గొర్రెలు అక్కడిక్కడే మృతి చెందాయి. తన జీవనాధారమైన గొర్రెలు మృతి చెందడంతో పెంపకందారుడు లక్షణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఆదుకోవాలని వేడుకున్నాడు.
ads