స్త్రీ విద్యకు శ్రీకారం పలికిన మహాత్ముడు పూలే

UPDATED 28th NOVEMBER 2019 THURSDAY 8:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): స్త్రీ విద్యకు శ్రీకారం పలికిన మహాత్ముడు జ్యోతిరావు పూలే అని ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి అన్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రమణారెడ్డి మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, కుల వ్యవస్థపైనే కాకుండా సమాజంపై ఆ వ్యవస్థను రుద్దే శక్తులను చీల్చి చెండాడిన ధీరోదాత్తుడు పూలే అని కొనియాడారు. ఆ మహానీయుని ఆశయాల సాధనకు కృషి చేయాల్సిన గురుతర బాధ్యత మనందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ కరక హిమ మహేశ్వరి, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.  

 

ads