'బీజేపీ వస్తే టీటీడీ బోర్డులో ధర్మచార్యులు సభ్యులుగా ఉంటారు’

తిరుపతి: ( రెడ్ బీ న్యూస్): సింహాచలం భూముల్ని రాజధానికి వాడాలని చూస్తున్నారు.. అలా చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. టీటీడీ ధర్మరక్షణకు రూ.500 కోట్లు ఇవ్వాలన్నారు. టీటీడీ కల్యాణ మండపాల నిర్వహణ సరిగా లేదని మండిపడ్డారు. టీటీడీ ఛానల్‌లో బ్లూ ఫిల్మ్ చూడటం దారుణమన్నారు. ఎస్వీబీసీ ఉద్యోగులను తీసేయాలన్నారు. ఛానల్‌ను ధర్మచార్యులకు అప్పగించాలని సూచించారు. బీజేపీ వస్తే టీటీడీలో బోర్డులో ధర్మచార్యులు సభ్యులుగా ఉంటారని చెప్పారు.
ads