వియ్ మిస్ ఆల్ ద ఫన్...వియ్ మిస్ ఆల్ ద జోయ్.

* ఆదిత్యలో ఘనంగా సీనియర్ విద్యార్థులకు వీడ్కోలు
* అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

UPDATED 18th MARCH 2020 WEDNESDAY 10:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): వియ్ మిస్ ఆల్ ద ఫన్..వియ్ మిస్ ఆల్ ద జోయ్..వియ్ మిస్ యూ.. అంటూ విద్యార్థులు బరువెక్కిన హృదయాలతో భారంగా తమ స్నేహితులు, గురువులతో గడిపిన క్షణాలతో ఆదిత్య క్యాంపస్ గంభీరంగా మారింది. 
గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విద్యార్దుల వీడ్కోలు పార్టీలతో ప్రాంగణమంతా పండగ వాతావరణం నెలకొంది. ఇంజనీరింగ్ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని బయటకు వెళ్తున్న తమ సీనియర్లకు తృతీయ సంవత్సరం విద్యార్థులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విద్యార్దులు, విభాగాధిపతి ప్రొఫెసర్ వి. సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డీన్స్ వివిధ విభాగాధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

 

ads