రైస్ కార్డుల కోసం సచివాలయాల్లో సంప్రదించండి

* ఆర్డీవో మల్లిబాబు

UPDATED 26th JUNE 2020 FRIDAY 11:30 AM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం డివిజన్ పరిధిలోని మండల గ్రామ సచివాలయాలకు సంబంధించి రేషన్ కార్డు స్థానంలో ఇచ్చిన రైస్ కార్డులు రాని వారు తమ రేషన్ కార్డు వివరాలతో గ్రామ, వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని ఆర్డీవో ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు. స్థానిక పాత్రికేయులతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో వార్డు సచివాలయాలు, గ్రామాల్లో గ్రామ సచివాలయాల్లో సంప్రదించాలని లేదా వీఆర్వో, గ్రామ, వార్డు సచివాలయ సెక్రటరీ, వార్డు, గ్రామ వలంటీర్ ను సంప్రదించి రైస్ కార్డు పొందాలని ఆయన కోరారు.

ads