కానిస్టేబుల్ మృతి

UPDATED 1st NOVEMBER 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్) : సామర్లకోట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న గుత్తుల సత్యనారాయణ (38) తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. కరప గ్రామానికి చెందిన ఆయన పెద్దాపురం సబ్ జైలుకు డ్యూటీ నిమిత్తం వెళ్ళి తీవ్ర అస్వస్థతకు గురవడంతో హుటాహుటిన సూర్య గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో శుక్రవారం కరపలో అంత్యక్రియలు నిర్వహించారు. పెద్దాపురం డిఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, సామర్లకోట ఎస్ఐ సుమంత్, తదితర పోలీస్ సిబ్బంది మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. 

ads