ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

గంగవరం, 26 ఏప్రిల్ 2020 (రెడ్ బీ న్యూస్):గోకవరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రగళ్లపాటి సోదరులు గంగవరం మండలం లోని పెద్దపల్లి, చిన్న అడ్డపల్లి,గంగవరం మెట్లపాలెం గ్రామాల్లో గిరిజన ప్రజలకు కాయగూరలు ఆహారం ప్యాకెట్లు ఆదివారం పంపిణీ చేశారు. అలాగే గంగవరం చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్, అటవీశాఖ, గ్రామ పంచాయితీ సిబ్బందికి మజ్జిగ ఆహార ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ అందజేశారు. ఆర్యవైశ్య సంఘం నుంచి పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ads