విద్యార్థుల అవగాహన కోసం ఆదిత్య హెల్ప్ లైన్ సెంటర్లు

* విద్యార్థుల ఉజ్జ్వల భవిష్యత్తుకు ఆదిత్య సిటీ ఆఫీసులు 
* ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి

UPDATED 19th OCTOBER 2020 MONDAY 9:00 PM

గండేపల్లి (రెడ్ బీ న్యూస్): విద్యార్థుల ఉజ్జ్వల భవిష్యత్తుకు ఆదిత్య సిటీ ఆఫీసులతో పాటు, పదవ తరగతి, ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ విద్యా రంగంలో 38 సంవత్సరాల   సుదీర్ఘ అనుభవం గల తమ విద్యా సంస్థల ఆధ్వర్యంలో పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో అత్యున్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పదవ తరగతి, ఇంటర్ తర్వాత ఉన్నత విద్య కోసం ఏ కోర్సు తీసుకోవాలి, ఎలాంటి కళాశాలను ఎంపిక చేసుకోవాలి, ఏ కళాశాలలో  ప్లేస్ మెంట్స్ ఎలా ఉన్నాయి తదితర అంశాలపై ఎటూ తేల్చుకోలేక సతమతమయ్యే పరిస్థితులు గమనించామని, అలాంటి వారి కోసం ఆదిత్య అకాడమీ (కాకినాడ), ఆదిత్య డిగ్రీ కళాశాల (రాజమహేంద్రవరం)లలో సిటీ ఆఫీసులు, హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశామని అన్నారు. అనేక మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సుదూర ప్రాంతాల నుంచి ఎంతో వ్యయప్రయాసలకోర్చి సూరంపాలెం క్యాంపస్ కు వచ్చి తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారని, అలాగే  కాకినాడ, రాజమండ్రిలలో గల తమ సంస్థలలో హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు జరిగిందని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 

 

 

ads