ఆదిత్యలో ఘనంగా న్యూటన్ జయంతి వేడుకలు

UPDATED 4th JANUARY 2021 MONDAY 5:30 PM

గండేపల్లి (రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రముఖ శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కళాశాల ఈఈఈ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్జ్వలన గావించి న్యూటన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ న్యూటన్ ప్రముఖ ఆంగ్ల, గణిత, భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త, వేదాంతి, రచయితని, అత్యంత ప్రభావవంతమైన శాస్త్రవేత్తలలో ఈయన ముందు వరుసలో ఉన్నారని అన్నారు. శాస్త్రీయ విప్లవంలో కీలకమైన వ్యక్తి అని, నేడు అంతరిక్ష పరిశోధనలు చేయడానికి ఆయన రూపొందించిన సిద్ధాంతాలే ముఖ్య కారణమని అన్నారు. వివిధ విభాగాలలో నిష్ణాతులైన శాస్త్రవేత్తలు, వారి జీవిత చరిత్రలు గురించి విద్యార్థులకు తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో క్యాంపస్ లో ఆయా భవనాలకు, కాటన్, కె.ఎల్.రావు, బిల్ గ్రేట్స్ , విశ్వేశ్వరాయ, సి.వి.రామన్, రామానుజన్, కలాం, తదితర వ్యక్తులు పేర్లు పెట్టడం జరిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈఈఈ విభాగ భవనానికి న్యూటన్ భవనంగా నామకరణం చేయడం జరిగిందని, విద్యార్థులు వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆయన అకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ పి.ఎస్.వి.వి.ఎస్.కుమార్, విభాగాధిపతులు కె. మనోజ్ కుమార్ రెడ్డి, ఎం. శ్రీనివాస్, జి. రామకృష్ణ, నరేష్, గ్రంధాలయ అధికారి కె. అశోక్ కుమార్, కె.వి.రమణ, మీడియా మేనేజర్ తోటకూర గంగాధర్, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads