వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

UPDATED 20th MARCH 2020 FRIDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సామర్లకోట పట్టణ పరిధిలో గల ఏడు ఆటో యూనియన్ నాయకులు, మాజీ కౌన్సిలర్ కర్రి కొఠారితో పాటు ఆయన వర్గీయులు శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పెద్దాపురం నియోజకవర్గ పార్టీ  కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు వారికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం సమిష్టిగా కలిసి పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బావిశెట్టి చక్రం, ఆటో యూనియన్ల అధ్యక్ష, కార్యదర్శులు ఆర్. చిన్న, అర్జున్, ఎం.  రమణ, వీరబాబు, మామిడాల కాసులు, నాగేంద్రప్రసాద్, శ్రీనివాసరావు, జి. నాగేశ్వరరావు, లంక వేణుగోపాల్, కంకణాల అప్పారావు, రవి, చిట్టూరి సత్యనారాయణ, దూది రాజబాబు, తదితరులు పాల్గొన్నారు.   

 

ads