గూగుల్ ఫోటోస్ యాప్‌ యూజర్స్‌కు షాక్!

న్యూఢిల్లీ:(రెడ్ బీ న్యూస్) గూగుల్ ఫోటోస్ యాప్‌లో మీ ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారా? ఫోనులో స్పేస్ ఎక్కువ మిగులుతుందనే ఉద్దేశంతో యాప్‌లోకి పంపిస్తున్నారా? అయితే మీకు త్వరలో ఇబ్బందులు తలెత్తనున్నాయి. ప్రస్తుతం ప్రతీ అకౌంట్‌కు 15జీబీ వరకు డిఫాల్ట్ స్టోరేజ్‌ను గూగుల్ ఉచితంగా అందిస్తోంది. ఒరిజినల్ క్వాలిటీ కలిగిన ఫోటోలను అప్‌లోడ్ చేస్తే, గూగుల్ ఇచ్చే స్టోరేజ్‌లో అది కౌంట్ అవుతుంది. హై క్వాలిటీతో ఫోటోలు అప్‌లోడ్ చేసినా ఉచితం వర్తిస్తుంది. ఐతే 2021 జూన్ ఒకటి తరువాత ఏ క్వాలిటీతో అప్‌లోడ్ చేసినా 15జీబీ డిఫాల్ట్ స్టోరేజ్‌లోకే వెళ్తుంది. ఉచితంగా అప్‌లోడ్ చేసే అవకాశం ఇకపై ఉండదు. అయితే 2021 జూన్ ఒకటి కన్నా ముందు అప్‌లోడ్ చేసిన ఫోటోలకు ఈ విధానం వర్తించదు. జూన్ ఒకటి తరువాత అప్‌లోడ్ చేయబోయే ప్రతీ ఫోటో 15జీబీ స్టోరేజ్‌లోనే ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్‌టాప్ ప్లాట్‌ఫారాలలో గూగుల్ ఫోటోస్ ఉపయోగించిన వారందరికీ ఇది వర్తిస్తుంది. మరోవైపు గూగుల్ ఫోటోస్‌లో మీ ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయడానికి కొత్త టూల్‌ను అందించనున్నట్లు గూగుల్ తెలిపింది. ఈ టూల్ డార్క్, బ్లర్ ఫోటోస్, లార్జ్ వీడియోస్‌ను గుర్తించి యూజర్లకు సూచన చేస్తుంది. వాటిని ఎంపిక చేసుకుని యూజర్లు డిలీట్ చేయొచ్చు. 2021 జూన్ నాటికి ఈ టూల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని గూగుల్ తెలిపింది. కాగా ఏదైనా జీమెయిల్ అకౌంట్ రెండేళ్ల పాటు ఇనాక్టివ్‌గా ఉంటే అందులో ఉన్న స్టోరేజ్‌ను గూగుల్ తొలగిస్తుంది.
ads