స్పందన కార్యక్రమానికి పది అర్జీలు

UPDATED 9th SEPTEMBER 2019 THURSDAY 5:30 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) : పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి పది అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో ఎస్. మల్లిబాబు తెలిపారు. వీటిలో స్టోన్ క్రషర్ నుంచి వచ్చే కాలుష్యాన్ని నివారించమని ఒకటి, వ్యవసాయ భూమిని ఆన్ లైన్ లో నమోదు చేయమని ఒకటి, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇప్పించమని ఒకటి, ఆక్రమణకు గురైన పంట పొలాన్ని తిరిగి ఇప్పించమని మూడు, పట్టాదారు పాసు పుస్తకం ఇప్పించమని ఒకటి, పట్టాదారు పాసు పుస్తకాలలో ఒకదానిని తొలగించమని ఒకటి, పూర్వార్జిత ఆస్తిని ఇప్పించమని ఒకటి, కమ్యూనిటీ భవనంలో చర్చిని తొలగించమని ఒకటి చొప్పున అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో తెలిపారు. 

ads