ప్రగతిలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు

UPDATED 7th SEPTEMBER 2019 SATURDAY 6:00 PM

గండేపల్లి (రెడ్ బీ న్యూస్) : గండేపల్లి మండలం సూరంపాలెంలోని ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో 2019-20 సంవత్సరం బిటెక్ ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్ధులను ఆహ్వానిస్తూ ద్వితీయ సంవత్సరం బిటెక్ విద్యార్థులు ఫ్రెషర్స్ డే వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ జూనియర్ విద్యార్థులకు అవసరమైన సూచనలు, సలహాలను అందిస్తూ వారు తమ లక్ష్య సాధనకు కృషి చేసే విధంగా దిశానిర్దేశం చేయడంలో సీనియర్ విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని అన్నారు. విద్యార్థుల మధ్య సహృద్భావ వాతావరణం పెంపొందించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ మాట్లాడుతూ తమలోని సాంస్కృతిక నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఈ వేదిక జూనియర్ విద్యార్థులకు చక్కని అవకాశాలను కలుగచేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా కళాశాలకు చెందిన ఎలక్ట్రికల్ &ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాలకు చెందిన విద్యార్థులు జూనియర్ విద్యార్థుల్లోని నైపుణ్యాలకు మెరుగుపెట్టే విధంగా నాట్య ప్రదర్శనలు, ఏక పాత్రాభినయాలు, స్క్రీట్స్, క్విజ్ వంటి వివిధ అంశాలలో పోటీలు నిర్వహించారు. భవిష్యత్తులో కళాశాల వివిధ విభాగాల వారీగా నిర్వహించే పలు కార్యక్రమాల పట్ల జూనియర్ విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని సీనియర్ విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాధబాబు, డైరక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ ఆడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, వివిధ విభాగాధిపతులు, సీనియర్ అధ్యాపకులు, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 

 

ads