రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

* వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్
* చదలాడలో రైతు భరోసా కేంద్రం తనిఖీ

UPDATED 25th JUNE 2020 THURSDAY 6:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): వ్యవసాయాన్ని లాభసాటి చేయడం ద్వారా రైతులను అన్ని విధాలా అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ కె.ఎస్.వి. ప్రసాద్ అన్నారు. మండల పరిధిలోని చదలాడ గ్రామంలో గల రైతు భరోసా కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతాంగం సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, విత్తనం వేసినప్పటి నుంచి పంట దిగుబడులు అమ్ముకునే వరకు అన్ని సేవలను రైతులు ఈ కేంద్రాల ద్వారా నిర్వహించుకోవచ్చని అన్నారు. అనంతరం డిజిటల్ కియోస్క్ యంత్రం పనితీరును ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ ఎం. రత్న ప్రశాంతి, ఏవో కొల్లి ద్వారకాదేవి, వీఏఏ కొల్లి ఉదయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

 

ads