గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

UPDATED 14th FEBRUARY 2020 FRIDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని డి.ఆర్.డి.ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వై. హరిహరనాథ్ పేర్కొన్నారు. స్థానిక టిటిడిసిలో ఉభయ గోదావరి జిల్లాల్లోని మండల సమాఖ్య ఓబీలు, హెల్త్ కమిటీ సభ్యులకు ఆరోగ్య అంశాలపై నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు ఎలాంటి పోషకాహార లోపం లేకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే మాతా, శిశు మరణాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మండల సమాఖ్యల ప్రతినిధులు, ఓబిలపై ఉందని తెలిపారు. ఈ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ అధికారిని జానకమ్మ, ఎపిడి శ్రీనివాసకుమార్, రిసోర్స్ పర్సన్స్ దువ్వూరి అన్నపూర్ణ,  తదితరులు పాల్గొన్నారు.

ads