వర్మీ కంపోస్టు తయారీపై శిక్షణ

గంగవరం:11 సెప్టెంబరు 2020(రెడ్ బీ న్యూస్): మండలంలో రైతు ఉత్పత్తి దారుల సంఘాలతో వారి అభివృద్ధి కోసం పనిచేస్తున్న టానేజర్ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మెత్త గ్రామం లో కేవీకే, పందిరిమామిడి వారి సహకారంతో తక్కువ ఖర్చుతో వానపాముల ఎరువు తయరీపై సంఘం సభ్యులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమము నిర్వహించారు. కేవీకే శాస్త్రవేత్తలు లలిత కామేశ్వరి, రాజశేఖర్ పాల్గొని వివిధ రకాల వానపాములు, వాటి లక్షణాలు, వానపాములు ఎరువు, బెడ్లు తయరీ, వాటికి కావాల్సిన వివిధ వస్తువులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వానపామూల - ఎరువు తయరీ విధానాలు, ఎరువును సేకరించడం, ఎరువు యొక్క పోషకాలు, సేంద్రియ ఎరువులు గురించి వీడియో చిత్రపటముల ద్వారా సభ్యులకు వివరించారు. కేవీకే గిరిజన ఉప ప్రణాళిక ద్వారా వీరి అభివృద్ధికి ఎన్నో కార్యక్రమములు చేపడుతున్న మని, గిరిజనులు వీటిపై అవగాహన పెంచుకుని టానేజర్ వంటి సంస్థ ద్వారా అందించే సేవలను సమర్థవంతంగా ఉపయోగించు కోవాలని సీనియర్ శాస్త్రవేత్త లలిత కామేశ్వరి వివరించారు. శిక్షణ తర్వాత వానపాములు బెడ్ లను ప్రత్యక్షంగా తయారు చేయించారు. అనంతరం సభ్యులకు వానపాముల కిట్లులను ఉచితంగా అందించారు. రైతు ఉత్పత్తి దారుల సంఘం సభ్యులు, బోర్డ్ ఆఫ్ డైరక్టర్లు, టానేజర్ మండల డీడీ రామరావు,ఎమ్.వో రామకృష్ణ సిబ్బంది పొల్గొన్నారు.
ads