పింఛన్ నిలిపివేశారని బెంగతో వితంతువు మృతి

UPDATED 14th FEBRUARY 2020 FRIDAY 8:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): పింఛన్ నిలిపివేశారని బెంగతో ఒక వితంతువు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం సామర్లకోట పట్టణంలో చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు, కుమార్తె అనంతలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం స్థానిక 14వ వార్డు సంగీతరావుపేటలో నివాసం ఉంటున్న          కాకి రామలక్ష్మి (57) కి జనవరి నెల వరకు ప్రతీ నెలా వితంతు పింఛన్ ఇచ్చేవారని, కానీ ఫిబ్రవరి నెలలో పింఛన్ నిలిచిపోయిందని అన్నారు. ఆమె ఇన్ కంటాక్స్ చెల్లిస్తున్నందున పింఛన్ నిలిపివేసినట్లు అధికారులు చెప్పడంతో తీవ్ర మనస్థాపం చెందిందన్నారు. రామలక్ష్మి పేరు మీద ఎలాంటి ఆస్తులు లేకుండా ఇన్ కం టాక్స్ ఎలా వచ్చిందని అడిగితే రీవెరిఫికేషన్ చేస్తామని అధికారులు పేర్కొన్నట్లు వారు తెలిపారు.  

ads