మత్తు పదార్థాల వాడకం లేని జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

కాకినాడ, 12 నవంబరు 2020 (రెడ్ బీ న్యూస్): మత్తు పదార్థాల వాడకం నుంచి జిల్లాను దూరం చేసేలా మాస్టర్ వలంటీర్స్ తీర్చి దిద్దాలని కలెక్టర్ డిమురళీధర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ విధాన గౌతమీ సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన నషా ముక్త వలంటరీ శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్, రాష్ట్ర సమన్వయకర్త హరిత అలంక్రిత, ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎల్ ప్రసాద్ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ రాజకుమారి, నషా ముక్త భారత్ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ ఉమారాజ్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు బానిసైనవారికి, విద్యార్థులకు నషా ముక్త భారత పథకంపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు మాస్టర్ వలంటరీలు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. జేసీ మాట్లాడుతూ ఈ పథకాన్ని జిల్లాలో అమలు చేసేందుకు కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు జరిగిందన్నారు. నషాముక్త భారత్ రాష్ట్ర సమన్వయకర్త మాట్లాడుతూ మాస్టర్ వలంటీర్లు మత్తు పదార్థాల బానిసలతో వ్యవహరించాల్సిన విధానం, వివిధ అంశాలపై వివరించారు.
ads