ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

* మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ నాగరాజు

UPDATED 13th FEBRUARY 2020 THURSDAY 8:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని  మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ జి. నాగరాజు పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం అక్కడ విధులు నిర్వహిస్తున్న సచివాలయ సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సౌకర్యాలు, సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్లు, ఇంటర్ నెట్ సౌకర్యాలు లేవని కొంతమంది సిబ్బంది ఆయన దృష్టికి తీసుకొచ్చారు. త్వరలో అన్ని సచివాలయాలకు కంప్యూటర్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.  ఇంటర్నెట్ సదుపాయం సరిగా పనిచేసేలా చూడాలని, అలాగే త్రాగునీరు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు, డిఇ సిహెచ్ రామారావు, మేనేజర్ అచ్యుతరాజు, పిఠాపురం మున్సిపల్ కమీషనర్ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు..

ads