రైలు ఢీకొట్టి వృద్ధురాలు మృతి

UPDATED 13th FEBRUARY 2020 THURSDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం గురువారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో సామర్లకోట రైల్వే స్టేషన్ లో రెండవ నెంబర్ ప్లాట్ ఫారం నుంచి ఒకటవ నెంబర్ కు పట్టాలు దాటుతుండగా విజయవాడ నుంచి  విశాఖపట్నం వెళ్తున్న సూపర్ ఫాస్ట్  రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆమె తీవ్రగాయాలతో  అక్కడికక్కడే మృతి చెందింది.  మృతురాలి వయస్సు సుమారు 70 సంవత్సరాలు ఉంటుందని, ఐదు అడుగులు ఎత్తు, నలుపు రంగులో ఉండి ఒంటిపై  పసుపు, నలుపు గీతల చీర నీలం రంగు జాకెట్ ధరించి ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు రవికుమార్ తెలిపారు. 

ads