పర్యావరణమిత్ర అవార్డు గ్రహీతకు అభినందనల వెల్లువ

UPDATED 10th JUNE 2019 MONDAY 8:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల హెడ్ క్యాషియర్, మీడియా ఇన్ ఛార్జ్  పర్యావరణ మిత్ర- 2019 అవార్డు గ్రహీత తోటకూర గంగాధర్ ను ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ పుట్టినరోజున మొక్కలు నాటుతూ, అలాగే బంధుమిత్రులను కూడా మొక్కలు నాటేలా ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణలో మొక్కలు ఆవశ్యకతను గుర్తించేలా అవగాహన కల్పించడంతో పాటు, శ్రీ శారద రామకృష్ణ సేవాసమితి ద్వారా మొక్కలు పంపిణీ కార్యక్రమం చేపడుతూ మొక్కలు పెంచేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. అలాగే మట్టి వినాయక ప్రతిమలు ఉచిత పంపిణీ కార్యక్రమం ద్వారా వాతావరణం కలుషితం కాకుండా చూడటం మనందరి బాధ్యతని రసాయనాలు, రంగులు లేని వినాయక ప్రతిమలను పూజించేలా ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. ప్లాస్టిక్ నిషేధం కొరకు ర్యాలీలు నిర్వహిస్తూ కరపత్రాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచుతూ పర్యావరణ పరిరక్షణలో విశేష కృషి చేస్తున్నందుకు గుర్తింపుగా ఈ నెల ఎనిమిదవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవావరణ సంస్థ, ఫిలాంత్రోఫిక్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో హోటల్ ఐలాపురం (విజయవాడ)లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో "పర్యావరణ మిత్ర" జాతీయ విశిష్ట సేవా పురస్కారం -2019 అవార్డు అందుకోవడం హర్షణీయమని అన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి,  డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి,  ప్రిన్సిపాల్స్ డాక్టర్  టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, డాక్టర్ కె. రవిశంకర్, టి.ఎస్.వి.ఎస్. కుమార్, డాక్టర్ డి. ఆస్థాశర్మ, ఇ. మోహన్, డాక్టర్ శరభోజీ, క్యాంపస్ ఇంఛార్జ్ భాస్కరచంద్రారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్స్, విభాగాధిపతులు, తదితరులు గంగాధర్ ను అభినందించారు. 

 

ads