నూకాలమ్మ ఆలయంలో భక్తుల సందడి

UPDATED 14th APRIL 2019 SUNDAY 9:00 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో వేంచేసిఉన్న నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు బారులుతీరారు. దీంతో ఆలయం వద్ద భక్తుల సందడి నెలకొంది. క్యూలైన్లో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి వేచి ఉన్నారు. ఎండ వేడిమి తగలకుండా చలువ పందిళ్లు వేయడంతో ఎండ తీవ్రత నుంచి భక్తులకు ఉపశమనం లభించింది. వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు విచ్చేశారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పులి నారాయణమూర్తి, సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ads