ప్రగతిలో నాల్గవ రోజు ఎన్.సి.సి శిక్షణా శిబిరం

UPDATED 14th MAY 2019 TUESDAY 6:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో 9(A) ఎయిర్ ఫోర్స్ వింగ్ (కాకినాడ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్.సి.సి శిక్షణా శిబిరం శనివారం ప్రారంభమైంది. నాల్గవరోజు శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం విద్యార్థులకు త్రివిధ దళాల్లో చేరడానికి కావలసిన మానసిక, శారీరక అభివృద్ధిపై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఉదయం ఆరు గంటలకు హెల్త్ వాక్ తో ప్రారంభించి అనంతరం రైఫిల్ షూటింగ్ లో శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దాపురం అగ్నిమాపక శాఖ సిబ్బందిచే అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు, మెళుకువలపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు తెలిపారు.           

ads