మహారాణీ కళాశాలలో బికాం కంప్యూటర్స్ కోర్సు ప్రారంభం

UPDATED 7th JUNE 2019 FRIDAY 9:00 PM

పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలో గల స్థానిక మహారాణీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి బికాం కంప్యూటర్స్ కోర్సు ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. వీరయ్యచౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బికాం కంప్యూటర్స్ కోర్సు ప్రారంభించేందుకు ఉన్నత విద్యామండలి నుంచి ఆదేశాలు జారీ అయ్యాయని అన్నారు. మెట్ట ప్రాంత విద్యార్థులకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుందని, కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, యాజమాన్యం ఎంతో శ్రమించి కళాశాలలో ఈ కోర్సు ప్రారంభించడంలో కృతకృత్యులయ్యారని అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.     

 

ads