ఐక్యతతోనే సమస్యల పరిష్కారం

* సీనియర్ జర్నలిస్టులు వెంకట్రావు, బుల్లియ్య, రాంబాబు

UPDATED 17th AUGUST 2021 TUESDAY 2.00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పాత్రికేయులు అంతా ఐక్యమత్యంగా ఉన్నప్పుడే సమస్యల పరిష్కారం సాధ్యపడుతుందని  సీనియర్ జర్నలిస్టులు అడపా వెంకట్రావు, రెడ్డిపల్లి రమణమూర్తి (బుల్లియ్య), రాకుర్తి రాంబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) 64 వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర, జిల్లా కమిటీ పిలుపు మేరకు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు రాకుర్తి రాంబాబు ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా యూనియన్ పతాకాన్ని సీనియర్ జర్నలిస్ట్ అడపా వెంకట్రావు ఆవిష్కరించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ సీనియర్ పాత్రికేయులు స్వర్గీయ మానుకొండ చలపతిరావు ఆగస్టు 17న ఏపీయూడబ్ల్యూజే సంఘాన్ని స్థాపించారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా సంఘాన్ని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగాలని అన్నారు. ఏపీయూడబ్ల్యూజేకి ప్రత్యేక గుర్తింపు ఉందని, జర్నలిస్టుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను సాధించుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి సీనియర్ జర్నలిస్టులు రెడ్డిపల్లి రమణమూర్తి, మొల్లి సూర్యనారాయణలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వర్కింగ్ జర్నలిస్టులు అందరికి అక్రిడిటేషన్ లు మంజూరు చెయ్యాలని, కోవిడ్ బారిన పడి మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు వెంటనే రూ.ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించాలని ఆర్డీవో ఎస్. మల్లిబాబు, డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పలపాటి చంద్రదాసు, పెమ్మాడి వీరభద్ర వర్మ, ఎలిశెట్టి సత్యన్నారాయణ, విజయ్, వెంకట్, వినాయక్, సుబ్బు, సూరిబాబు, శ్రీరామ్, చవ్వాకుల ఈశ్వరరావు, రాయవరపు వీరబాబు, బొదిరెడ్డి బుజ్జిబాబు పలువురు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us