యువత సేవాభావం కలిగి ఉండాలి

పెద్దాపురం,17 ఏప్రిల్ 2021(రెడ్ బీ న్యూస్):యువత సేవాభావాన్ని కలిగి ఉండాలని ఉమాశంకర సేవా సంఘం అధ్యక్షుడు జీను వెంకటరమణ అన్నారు. పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో ఉమా శంకర సేవా సంఘం ఆధ్వర్యంలో నిరుపేదలకు శనివారం వస్త్రదానం చేశారు. పెద్దాపురం వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ దవులూరి దొరబాబు పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సంఘం అధ్యక్షుడు రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేలెం వెంకన్న బాబు, అడపా సాయిరాం తుమ్మలపల్లి సత్తిబాబు, తుమ్మలపల్లి దుర్గాప్రసాద్, రాంబాబు, కూరాకుల వెంకట పాపారావు, మేలెం సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
ads