బహిరంగ వేలం ద్వారా మరిడమ్మ దేవస్థానానికి రూ.1.47 లక్షలు ఆదాయం

UPDATED 13th OCTOBER 2020 TUESDAY 7:30 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): పాత ఇనుము, ప్లాస్టిక్, సత్తు, తదితర సామాగ్రి అమ్మకానికి సంబంధించి మంగళవారం నిర్వహించిన బహిరంగ వేలం పాట ద్వారా దేవస్థానానికి రూ.1,47,500 సమకూరినట్లు మరిడమ్మ అమ్మవారి దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 12 మంది పాల్గొన్న ఈ వేలం పాటలో సామర్లకోట పట్టణానికి చెందిన బిక్కిన సాయిబాబు వీటిని దక్కించుకున్నట్లు తెలిపారు.  

ads