సామర్లకోట-పెద్దాపురం రహదారిలో ప్రమాదకరంగా గొయ్యి

UPDATED 31st OCTOBER 2019 THURSDAY 9:00 PM 

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సామర్లకోట-పెద్దాపురం రహదారిలో ప్రమాదకరంగా ఉన్న గొయ్యిని వెంటనే పూడ్చాలని శ్రీశివశంకర దుప్పట్ల వర్తక సంఘం స్థానిక మఠం సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. స్థానిక విఘ్నేశ్వర థియేటర్ వద్ద రోడ్డు విస్తరణ పనులు పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతో రహదారిపై గొయ్యి ఏర్పడిందని, దీంతో వాహన చోదకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. రహదారిపై ఉన్న గోతులను వెంటనే పూడ్చాలని సామర్లకోట మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబుకి వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కరణం శ్రీనివాస్, కరణం సత్యనారాయణ, కోశాధికారి పోతిన శ్రీనివాస్, కరణం గోవిందరావు, టి. రాజు, కరణం రామకృష్ణ, బత్తుల బాలాజీ, టి. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

 

ads