కోవిడ్ విధుల్లో పనిచేసే సిబ్బందికి సౌకర్యాలు కల్పించాలి

సామర్లకోట,23 ఏప్రిల్ 2020 (రెడ్ బి న్యూస్):కోవిడ్ - 19 విధుల్లో ఉన్న వైద్య, ఆరోగ్య, ఆశ,అంగన్వాడీ,మునిసిపల్, సచివాలయం,వాలంటీర్ల, పోలీస్,మీడియా సిబ్బందికి ప్రభుత్వం నుంచి మెరుగైన రక్షణ చర్యలు కల్పించాలని సీఐటీయూ మండల కమిటి గురువారం విజ్ఞప్తి చేసింది.ఈ సందర్భంగా సీఐటీయూ మండల అధ్యక్షులు బర్ల గోపాల్,ఉపాధ్యక్షులు బాలం శ్రీనివాస్ ఒక ప్రకటన విడుదల చేసారు.అనంతరం వారు మాట్లాడుతూ సామర్లకోటలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన కారణంగా సిబ్బందికి మెరుగైన రక్షణ సౌకర్యాలు కల్పించాలని మాస్కులు,శానిటైజర్లు అందించాలని డిఎం &హెచ్ ఓ, అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులను కోరారు. సకాలంలో వాటిని అందుబాటులో ఉంచాలన్నారు. సామర్లకోట జనాభాను బట్టి ఆశ వర్కర్స్ 55 నుండి 60 మంది ఉండాలని,కేవలం 14 మంది మాత్రమే ఉన్నారని, ఏఎన్ఎం లు 15 మంది ఉండాలని,10 మంది మాత్రమే ఉన్నారని,జనాభాకు తగిన విధంగా ఆశ,ఏఎన్ఎం సంఖ్య పెంచాలని వారు విజ్ఞప్తి చేశారు
ads