దాడులు జరిగిన ఆలయాలకు చినజీయర్

అమరావతి:4 జనవరి 2021(రెడ్ బీ న్యూస్): రాష్ట్రంలో దేవాలయాలపై వరుస దాడుల నేపథ్యంలో ఈనెల 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని వేదవిశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు శ్రీత్రిదండి చినజీయర్‌ స్వామి నిర్ణయించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రామతీర్థంలో రాముడి విగ్రహ ధ్వంసంను దాడులకు పరాకాష్ఠగా చినజీయర్‌ పేర్కొన్నారు. దాడులు జరిగిన ఆలయాలను సందర్శించి రక్షణ విషయంలో తీసుకోవాల్సిన తక్షణ, దీర్ఘకాలిక చర్యల గురించి స్థానికులతో చర్చిస్తామని తెలిపారు. ఆలయాల పట్ల శ్రద్ధ ఉన్నవారంతా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని స్వామి పిలుపునిచ్చినట్టు వికాస తరంగణి సంఘటన కార్యదర్శి శ్రీకార్యం భవానీప్రసాద్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు
ads