రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ డివిజన్ అధ్యక్షుడుగా కృష్ణారావు

UPDATED 8th FEBRUARY 2019 FRIDAY 5:00 PM

పెద్దాపురం: పెద్దాపురం డివిజన్ రెవెన్యూ అసోసియేషన్ ఎన్నికలు స్థానిక ఆర్డీవో కార్యాలయం ఆవరణలో శుక్రవారం జరిగాయి. పెద్దాపురం డివిజన్ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడుగా పెద్దాపురం డిప్యూటీ తహసీల్దార్ టి.ఎ. కృష్ణారావు, అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్.వి. నాంచారయ్య, ఉపాధ్యక్షులుగా (జనరల్) ప్రత్తిపాడు డిప్యూటీ తహసీల్దార్ ఎన్. వెంకటేశ్వరరావు, కిర్లంపూడి డిప్యూటీ తహసీల్దార్ ఎన్. గురుమూర్తిరెడ్డి, మహిళా ఉపాధ్యక్షురాలిగా జగ్గంపేట ఎం.ఆర్.ఐ ఎన్. వెంకటలక్ష్మి, కార్యదర్శిగా జగ్గంపేట ఎలక్షన్ డిటి ఎం.వి.వి. భానుకుమార్, జాయింట్ సెక్రటరీగా కోటనందూరు ఎం.ఆర్.ఐ సిహెచ్. దయానందరాజు, జాయింట్ సెక్రటరీలుగా శంఖవరం తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ బిహెచ్. భాస్కరప్రసాద్, గండేపల్లి సీనియర్ అసిస్టెంట్ ఎల్. నాగేశ్వరరావు, ట్రెజరర్ గా ఏలేశ్వరం ఎం.ఎస్.వో  సీనియర్ అసిస్టెంటు ఎస్.కె.ఇస్మాయిల్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గా రంగంపేట ఆర్.ఐ ఎం.డి. గాలిబ్, తుని తహసీల్దార్ కార్యాలయ డ్రైవర్ ఎన్. నజీర్ ఖాన్, జిల్లా ఇసి మెంబర్లుగా ఆర్డీవో ఆఫీసు సబార్డినేట్ కె. సన్యాసిరావు, తొండంగి తహసీల్దార్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ డి. శివకుమార్, ఏలేశ్వరం ఎం.ఆర్.ఐ ఎస్. పొన్నాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి కె. వీరబాబు ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియకు పెద్దాపురం ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్, ఏపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (అమరావతి), జిల్లా రెవెన్యూ అధ్యక్షులు పితాని త్రినాధ్, ఏ.పి.ఆర్.ఎస్.ఎ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఎస్.దివాకర్, జిల్లా అసోసియేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఎం. విజయకుమార్, సహాయ ఎన్నికల అధికారి ఎన్.ఎస్. ప్రసాద్, పెద్దాపురం తహసీల్దార్ గంగుమళ్ల బాలసుబ్రహ్మణ్యం, ప్రభుత్వ వాహనాల డ్రైవర్లు సంఘం తరుపున సంసాని శ్రీనివాసరావు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, విఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆర్డీవో వసంతరాయుడు మాట్లాడుతూ పెద్దాపురం డివిజన్ నూతన రెవెన్యూ అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం అభినందనీయమని, రెవెన్యూ ద్వారా పేద ప్రజలకు సేవలందించడం దేవుడిచిన వరమని అన్నారు. ప్రతీ రెవెన్యూ ఉద్యోగి తమ విధులను బాధ్యతతో నిర్వహించి, ప్రతీ అంశాలను క్షుణ్ణంగా తెలుసుకుని మంచి ఉద్యోగిగా పేరు తెచ్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు త్రినాధరావు మాట్లాడుతూ మెరుగైన సేవలు అందించడం ద్వారా మంచి గుర్తింపు వస్తుందని, ప్రతీ ఉద్యోగి తమ ఉద్యోగంలో భద్రతతో పాటు, బాధ్యతలను కూడ గుర్తించాలని తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఎస్. దివాకర్ మాట్లాడుతూ అసోసియేషన్ ద్వారా ఉద్యోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి రాష్ట్ర అసోసియేషన్ కృషి చేస్తుందని చెప్పారు. నూతనంగా ఎన్నికైన డివిజన్ అధ్యక్షులు కృష్ణారావు మాట్లాడుతూ పెద్దాపురం డివిజన్ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు తన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అసోసియేషన్ సభ్యులచే ప్రతిజ్ఞ చేయించారు. 

 

ads