గుర్తు తెలియని వ్యక్తి మృతి

UPDATED 5th FEBRUARY 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక అన్నపూర్ణమ్మ గుడి వద్ద రైల్వే ట్రాక్ డౌన్ లైన్ వద్ద సుమారు 50 సంవత్సరములు వయస్సు గల మృతి చెందిన వ్యక్తిని రైల్వే పోలీసులు మంగళవారం కనుగొన్నారు. డ్యూటీలో ఉన్న రైల్వే కీమెన్ సామర్లకోట రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. రైల్వే పోలీసుల కధనం ప్రకారం సామర్లకోట నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారిపడి మృతి చెంది ఉండవచ్చని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ జె. గోవిందరావు తెలిపారు.

ads