మహనీయుడు పొట్టి శ్రీరాములు

* ఎంపీడీవో రమణారెడ్డి 
* ఘనంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం 

UPDATED 1st NOVEMBER 2019 FRIDAY 8:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): జాతిపిత మహాత్మాగాంధీ శాంతి మార్గంలో స్వాతంత్య్రం సాధిస్తే, పొట్టి శ్రీరాములు త్యాగంతో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని పెద్దాపురం ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎంపీడీవో రమణారెడ్డి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు దేశంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడేందుకు బీజం వేశారని, సమసమాజ స్థాపన జీవిత ఆశయంగా తీసుకుని విజయం సాధించారని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం సూపరెంటెండెంట్ వీరేశ్వరపు శ్రీనివాస్, ఈవోపీఆర్డీ కరక హిమమహేశ్వరి, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.        

 

ads