హరహర మహాదేవ శంభోశంకర..

* కార్తీకమాసం ప్రారంభం
* కళకళలాడుతున్నశివాలయాలు

UPDATED 29th OCTOBER 2019 TUESDAY 8:30 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): పరమేశ్వరుని పూజించటానికి అత్యంత శ్రేష్ఠమైనదిగా భావించే కార్తీకమాసం మంగళవారం నుంచి ప్రారంభమైంది. కార్తీకమాసం పురస్కరించుకుని సామర్లకోట పట్టణ, మండల పరిధిలోని శివాలయాలు భక్తుల హర నామస్మరణలతో మార్మోగాయి. ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాస పూజలు మంగళవారం ఘనంగా ప్రాంభమయ్యాయి. వేకువజామున అధిక సంఖ్యలో దేవాలయానికి తరలివచ్చిన భక్తులు స్వామివారి పుష్కరిణి, గోదావరి కాలువలో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామివారికి పిఠాపురం మహారాజా గోత్ర నామాలతో తొలి పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు.

 

 

ads