పీడీఎస్ బియ్యం స్వాధీనం

సామర్లకోట, 24 ఆగస్ట్ 2021(రెడ్ బీ న్యూస్); తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణం లారీ యూనియన్ ఆఫీస్ సమీపంలోని బీబీఆర్ స్కూల్ ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. అయితే సామర్లకోట నడిబొడ్డున ఉన్న బియ్యం స్థావరాలపై నిఘా ఉంచాల్సిన స్థానిక పోలీసులు మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీన్ని గ్రహించిన జిల్లా పోలీసు అధికారులు ప్రత్యేక బృందాన్ని సామర్లకోటకు పంపి బియ్యం దాచిన ఇంటిపై దాడి చేసి బియ్యం సీజ్ చెయ్యడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us