జాబ్ మేళాకు విశేష స్పందన

UPDATED 11th JUNE 2019 TUESDAY 8:00 PM

పెద్దాపురం: కౌశల్ గోదావరి, వికాస, సాగర్ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక సాగర్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించినట్లు సాగర్ కళాశాల ప్రిన్సిపాల్ ముమ్మారెడ్డి అచ్యుతరామయ్య తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ అచ్యుత రామయ్య మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో ఇండిగో ఎయిర్ లైన్స్, బిగ్ బాస్కెట్, టాటా మోటార్స్, తదితర కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించారని అన్నారు. ఈ జాబ్ మేళాకు సుమారు 368 మంది అభ్యర్థులు హాజరుకాగా వారిలో 65 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని అన్నారు. ఎంపికైన అభ్యర్థులకు కంపెనీ ప్రతినిధులు ధ్రువపత్రాలు అందచేసినట్లు ఆయన తెలిపారు.      

ads