చిరస్మరణీయుడు అంబేద్కర్

UPDATED 14th APRIL 2019 SUNDAY 9:00 PM

పెద్దాపురం: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ చిరస్మరణీయుడని, ఆయన దేశానికి విశిష్ట సేవలు చేశారని పెద్దాపురం తహసీల్దార్ కలగర గోపాలకృష్ణ అన్నారు. డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ 128వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఆర్డీవో కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి తహసీల్దార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో పరిపూర్ణ ప్రజాస్వామ్యానికి పునాది వేసిన మహనీయులు అంబేద్కర్ అని కొనియాడారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయం వంటి భావనలతో భారత రాజ్యాంగ రచనలో ఆయన అందించిన సేవలను గుర్తుచేశారు. పలు విప్లవాత్మక, జనరంజక విధానాలను అమల్లోకి తెచ్చారన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయం ఏవో నాంచారయ్య, ఎలక్షన్ డిటి శ్రీనివాసరావు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.   

ads