కరోనా కష్టకాలంలో స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం

గంగవరం:14 సెప్టెంబరు 2020(రెడ్ బీ న్యూస్): కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయమని మండల పరిషత్ అభివృద్ధి అధికారి జాన్ మిల్టన్ అన్నారు. పాత రామవరం క్రీస్తు సంఘం చర్చలో లైఫ్ కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు స్నేహజ్యోతి ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధులకు రగ్గులు బియ్యం, నిత్యవసర వస్తువులు సోమవారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో వృద్ధులకు పేద ప్రజలకు సేవలు అందించడం గొప్ప విషయం అన్నారు. ఏజెన్సీలో పేద ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని కొనియాడారు. లాక్ డౌన్ సమయములో తమ గ్రామంలోనే కాకుండగా మైదాన ప్రాంతంలో కూడా పేద ప్రజలకు లైఫ్ కేర్ ఫౌండేషన్ ద్వారా సేవలు అందించడం ఎంతో అభినందనీయమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచులు బూరు కట్ల నాగేశ్వరరావు, పార్వతి ప్రశంసించారు. లైఫ్ కేర్ ఫౌండేషన్ అధ్యక్షులు అమూల్య మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా పౌండేషన్ ద్వారా వృద్ధులకు, వికలాంగులకు, అనాధలకు వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతొందన్నారు.
ads