ఆత్మత్యాగంతోనే రాష్ట్రావతరణ

* ప్రాణాలర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు 
* పెద్దాపురం ఆర్డీవో ఎస్.మల్లిబాబు

UPDATED 1st NOVEMBER 2019 FRIDAY 7:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతోనే రాష్ట్రావతరణ సాధ్యమైందని, రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడని పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు అన్నారు. ఆంధ్ర రాష్ట్ర  అవతరణ దినోత్సవ వేడుకలు స్థానిక ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ తెలుగుభాష మాట్లాడే వారి కోసం ప్రత్యేకాంధ్రరాష్ట్రాన్ని కోరుతూ 58 రోజులు దీక్ష సాధించి అమరుడైన పొట్టిశ్రీరాములు త్యాగం ఎనలేనిదని అన్నారు. ఆయన త్యాగాన్ని గుర్తించుకుని మహనీయులందరి స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధికి అంతా ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం ఏవో చిన్నారావు, తదితరులు పాల్గొన్నారు.      

 

ads