దేశ సమైక్యతకు తోడ్పడిన మహోన్నత వ్యక్తి పటేల్‌

* కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు 
* ప్రగతిలో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం

UPDATED 31st OCTOBER 2019 THURSDAY 8:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): భారతదేశ సమైక్యతకు, స్వరాజ్య ఏకీకరణకు పాటుపడిన గొప్ప మహనీయుడు ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అని ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని స్థానిక ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్, క్రీడా విభాగాల ఆధ్వర్యంలో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ సర్దార్‌ వల్లభాయ్ పటేల్ ప్రముఖ స్వాతంత్య్ర యోధుడిగానే కాకుండా, స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు విలీనం చేయడానికి కృషి చేసిన మహోన్నత వ్యక్తిగా, ఉక్కు మనిషిగా పేరుపొందారని అన్నారు. దేశీయ ఐక్యతకు, జాతీయ సమక్యతకు కృషి చేసిన వల్లభాయ్ పటేల్‌ జన్మదినాన్ని జాతీయ ఐక్యత దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. విద్యార్థులు జాతీయ సమైక్యతను, సోదర భవాన్ని పెంపొందించుకొని సమాజంలో ఉన్నత వ్యక్తులుగా ఎదగాలని ఆయన ఆకాక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్ధులకు చిత్రలేఖనం, ఇండోర్ గేమ్స్, యూనిటీ రన్, ఐక్యతా ప్రతిజ్ఞ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాధబాబు, డైరెక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్-అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, డీన్ ఆర్&డీ డాక్టర్ పి.వి.ఎస్. మాచిరాజు, వివిధ విభాగాధిపతులు, తదితరులు పాల్గొన్నారు. 

 

 

ads