మేలైన విత్తనాలతో అధిక దిగుబడులు

* రిలయన్స్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ బర్రే నాగేశ్వరావు
* విత్తనోత్పత్తి, విత్తన శుద్ధిపై అవగాహన

UPDATED 23rd JUNE 2020 TUESDAY 6:30 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): మేలైన విత్తన రకాలతో అధిక దిగుబడులు సాధించవచ్చని రిలయన్స్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ బర్రే నాగేశ్వరావు పేర్కొన్నారు. మండలంలోని కట్టమూరు గ్రామంలో రిలయన్స్ ఫౌండేషన్, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విత్తనోత్పత్తి, విత్తన శుద్ధిపై మంగళవారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా తెగుళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని, ముఖ్యంగా శిలీంద్రాలు ద్వారా వ్యాపించే అగ్గి, మాగుడు, వేరు కుళ్ళు, తదితర తెగుళ్ళ బారి నుంచి పంటలను సంరక్షించుకోవచ్చని అన్నారు. ప్రతీ సంవత్సరం రిలయన్స్ ఫౌండేషన్ తరఫు నుంచి రైతులకు నాణ్యమైన విత్తనాలను ఉచితంగా అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనిలో భాగంగా కట్టమూరు గ్రామంలో సుమారు 60 మంది రైతులకు ఒక్కొక్కరికి రెండు కేజీల చొప్పున వరి విత్తనాలను అందజేశారు. అనంతరం విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కె. అమృత, హార్టికల్చర్ అసిస్టెంట్ సిహెచ్ విజయదుర్గ విత్తన శుద్ధి, విత్తన ఉత్పత్తి ఏ విధంగా చేయాలో   రైతులకు చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ ప్రోగ్రాం సపోర్టర్ బచ్చల శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  గ్రామ నాయకుడు నల్లల గోవిందు, రైతులు నలమాటి రాంబాబు, మేడిద కాట్రాజు, అడపా సుబ్రహ్మణ్యం, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. 
 

ads