ఆదిత్యలో మరో రెండు కొత్త కోర్సులకు అనుమతి

UPDATED 17th OCTOBER 2020 SATURDAY 6:00 PM

గండేపల్లి (రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో 2020-21 విద్యా సంవత్సరం నుంచి కంప్యూటర్ విభాగంలో మరో రెండు కొత్త కోర్సులకు అనుమతి లభించినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ విభాగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్  కోర్సులు ఇప్పుడు తమ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.  విద్యార్థులు నేటి పోటీ ప్రపంచంలో పరిశ్రమలకు అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంజనీరింగ్ నాలుగు సంవత్సరాల్లో తరగతి గదిలోనే అందిపుచ్చుకొని మల్టీ నేషనల్ కంపెనీల్లో మంచి ప్యాకేజీతో ఉన్నతస్థాయి కొలువులు ఈ కోర్సులతో పొందే అవకాశం ఉంటుందని అన్నారు. 

 

ads