కరోనా వ్యాధి నివారణపై అవగాహన కల్పించాలి

UPDATED 19th MARCH 2020 THURSDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి ప్రబలకుండా అంగన్వాడీ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని ఐసిడిఎస్ అర్బన్ సిడిపిఒ పంతం సావిత్రి పేర్కొన్నారు. స్థానిక బ్రౌన్ పేట సెంటర్లో బ్రౌన్ పేట సెక్టార్ పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ కరోనా వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు సెక్టార్ పరిధిలో గల అన్ని అంగన్వాడీ ప్రీస్కూల్స్ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించాలని,  తదుపరి సిబ్బంది మూడు గంటల వరకు సెంటర్లు తెరిచి ఉంచాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు తమ సెంటర్ పరిధిలో ఉన్న ప్రజలకు కరోన వైరస్ పై అవగాహన పెంచి వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్ వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

ads