21 టన్నుల పీడీఎస్ బియ్యం పట్టివేత

UPDATED 15th OCTOBER 2020 THURSDAY 9:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): పెద్దాపురం పట్టణ శివారు వాలుతిమ్మాపురం జంక్షన్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 21 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని గురువారం పట్టుకున్నట్లు ఎస్సై ఏ. బాలాజీ తెలిపారు. గుంటూరు నుంచి లారీలో అక్రమంగా తరలిస్తున్న ఈ బియ్యాన్ని వాహనాల తనిఖీల్లో భాగంగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. దీంతో లారీతో సహా డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దీని విలువ సుమారు రూ. నాలుగు లక్షలు పైబడి ఉంటుందన్నారు. గుంటూరుకు చెందిన కొమ్మా శివశంకర్ అనే వ్యాపారి దీనిని సామర్లకోటకు తరలిస్తున్నాడని తెలిపారు. ఈ విషయాన్ని సివిల్ సప్లైస్ అధికారులకు తెలియచేసి వాహనంతో పాటు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఏఎస్ఓ ప్రసాద్, ఎంఎస్ఓ లక్ష్మీకుమారి సమక్షంలో సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.

ads