ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకారం

* నెక్కంటి సీఫుడ్స్ అడ్మిన్ మేనేజర్ ఉండవిల్లి గోపీచంద్

UPDATED 14th AUGUST 2021 SATURDAY 7:00 PM

పెద్దాపురం: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్నట్లు నెక్కంటి సీఫుడ్స్ లిమిటెడ్ అడ్మిన్ మేనేజర్ ఉండవిల్లి గోపీచంద్ అన్నారు. మండల పరిధిలోని కట్టమూరు, జె.తిమ్మాపురం గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో రూ.50 లక్షల వ్యయంతో విద్యార్థులు భోజనాలు చేసేందుకు వీలుగా ఉండేలా అత్యాధునికంగా నిర్మించిన రెండు డైనింగ్ హాళ్లను ఎంఈవో జోసెఫ్ తో కలిసి శనివారం ప్రారంభించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఎంఈవో జోసెఫ్  మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు, దాతల సహాయ సహకారాలు ఎంతో అవసరమని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల్లో డైనింగ్ హాల్స్ నిర్మించిన నెక్కంటి సీఫుడ్స్ యాజమాన్యానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కట్టమూరులో పాఠశాల నిర్మాణానికి స్థల దానం చేసిన నెక్కంటి అన్నపూర్ణమ్మ, రామలక్ష్మీలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నెక్కంటి సీఫుడ్స్ మేనేజర్ వి. సాయిరమేష్, మెకానికల్ హెడ్ ఆకుల సాయి, వి. రామారావు, కట్టమూరు ఉప సర్పంచ్ బండారు చంటిబాబు, జీను వెంకట రమణ, రంగనాధం జీవా, మేడిద శ్రీనివాస్, పెంట విజయ కుమార్, ఉపాధ్యాయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us