ఎంపీడీవోను అభినందించిన జిల్లా కలెక్టర్

UPDATED 26th APRIL 2021 MONDAY 8:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో పెద్దాపురం మండలం నుంచి జి. రాగంపేట గ్రామం ఎంపిక కావడంపై జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డిని, పంచాయతీ కార్యదర్శి సెలెట్ రాజును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) విభాగంలో రాష్ట్రస్థాయిలో జి. రాగంపేట పంచాయతీకి గుర్తింపు తీసుకురావడంపై వారిని ఆయన అభినందించి ప్రశంశా పత్రాన్ని అందచేశారు. అలాగే జిల్లా పరిషత్ సీఈవో ఎన్.వి.వి. సత్యనారాయణ కూడా వీరిని అభినందించారు.

ads