విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకోవాలి

* వైసీపీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు 

UPDATED 4th MAY 2020 MONDAY 2:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): విపత్తుల సమయంలో ప్రజలకు సేవలు అందించేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు అన్నారు. మండల పరిధిలోని పులిమేరు గ్రామంలో పార్టీ నాయకులు బోనాసు గుర్రాజు, తుమ్మల అచ్యుత రామయ్యల ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన సుమారు 1450 కుటుంబాలకు కూరగాయలు, కోడిగ్రుడ్లు దొరబాబు చేతులు మీదుగా సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ ప్రజలకు సేవలు అందించిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. కరోనా సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఆర్ధిక భరోసాతో ఆదుకున్నారన్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించిన తీరు అభినందనీయమన్నారు. అనంతరం గుర్రాజు, అచ్యుత రామయ్యల ఆధ్వర్యంలో గ్రామంలో ప్రతీ కుటుంబానికి కూరగాయలు కోడిగ్రుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షుడు గవరసాన సూరిబాబు, మండల యూత్ అధ్యక్షుడు గోపు మురళి, పార్టీ నాయకులు తుమ్మల వెంకటరత్నం, తోట శ్రీను, దాడి చంటి, తుమ్మల వాసు, బెజవాడ బాబీ, సుందరరెడ్డి రాజు, కోలా సురేంద్ర, జయ, గంగరాజు, పేర్రాజు, బుచ్చిరాజు, తదితరులు పాల్గొన్నారు.

ads