దేశ సమగ్రతకు కృషిచేసిన మహనీయుడు పటేల్‌

UPDATED 31st OCTOBER 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): దేశ సమైఖ్యత, స మగ్రతకు, ఐక్యతకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి  సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అని ఎంపిడిఓ కర్రి స్వప్న, తహసీల్దార్ వి. జితేంద్ర  అన్నారు. ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని సందర్భంగా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. తొలుత వల్లభాయ్‌ పటేల్‌ చిత్రపటానికి ఎంపిడిఓ స్వప్న, తహసీల్దార్ జితేంద్ర పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశ సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను వల్లభాయ్‌ పటేల్‌ చేపట్టారని, దేశ ఐక్యత, సమగ్ర, సమైక్యతకు విశేష కృషి చేసిన మహానుభావుడని తెలిపారు. అనంతరం దేశ సమైక్యత, సమగ్రత, ఐక్యత కోసం పాటుపడాలని ఎంపీడీవో ప్రతిజ్ఙ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది విప్పర్తి సాయిబాబా, ఐసీహెచ్ హెల్డా, తదితరులు పాల్గొన్నారు.   

 

ads