రెడ్ క్రాస్ రాష్ట్ర కమిటీ సభ్యునిగా మధుసూదన్ రెడ్డి

UPDATED 27th NOVEMBER 2019 WEDNESDAY 10:00 PM

రాజానగరం(రెడ్ బీ న్యూస్): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మేనేజ్ మెంట్ కమిటీ సభ్యునిగా స్థానిక కెఎల్ఆర్ లెనోరా దంత వైద్య కళాశాల కార్యదర్శి మధుసూదన్ రెడ్డి ఎన్నికయ్యారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో బుధవారం ఉదయం రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ చైర్మన్ డాక్టర్ శ్రీధరరెడ్డి, కెఎల్ఆర్ లెనోరా విద్యా సంస్థల చైర్ పర్సన్ కె. నాగమణి, తదితరులు ఆయనను అభినందించారు.

 

ads